చంద్రబాబు వరాల జల్లు... ఒకేసారి 7 స్కీమ్‌లు ప్రకటించిన ఏపీ సీఎం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలపై వరాల జల్లు కురిపించారు. ఎవ్వరూ ఊహించని విధంగా ఒకసారి 7 పథకాలు ప్రకటించారు. అయితే ఈ పథకాలన్నీ దివ్యాంగులకే కావడం విశేషం. అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకుని విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగిన కార్యక్రమంలో సీఎం ఈ ప్రకటన చేశారు.
దివ్యాంగులకు చంద్రబాబు ప్రకటించిన స్కీమ్‌లు:
- ఆర్టీసీ బస్సుల్లో దివ్యాంగులకు ఉచిత ప్రయాణం
- స్థానిక సంస్థలు, కార్పోరేషన్లు, పబ్లిక్ సెక్టార్ సంస్థల్లో కనీసం ఒక దివ్యాంగ ప్రతినిధిని నామినేట్ చేయడం
- ఆర్ధిక సబ్సిడీ పథకాన్ని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల మాదిరిగానే దివ్యాంగులకు ప్రత్యేక కార్యక్రమం
- దివ్యాంగులకు శాప్ ద్వారా స్పోర్ట్స్ ఈవెంట్స్, టాలెంట్ డెవలప్‌మెంట్ పథకాలు అందుబాటులో ఉంచడం
- ప్రభుత్వ హౌసింగ్ ప్రాజెక్ట్‌లలో దివ్యాంగులకు గ్రౌండ్ ఫ్లోర్ కేటాయించడం
- వినికిడి లోపం ఉన్న విద్యార్ధులకు ప్రత్యేక డిగ్రీ కాలేజీ
- రెసిడెన్షియల్ స్కూల్స్, కాలేజీలు, హాస్టల్స్‌లో చదివే దివ్యాంగ విద్యార్ధులకు పెన్షన్
- అమరావతిలో దివ్యాంగ భవన్
కాగా.. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌లో మహిళలకు స్త్రీ శక్తి పథకం కింద ఉచిత బస్సు ప్రయాణ సదుపాయాన్ని చంద్రబాబు ప్రభుత్వం కల్పిస్తోన్న సంగతి తెలిసిందే. 2025 ఆగస్ట్ 15 నుంచి ఈ పథకం అమల్లోకి వచ్చింది. అలాగే స్త్రీ శక్తి పథకాన్ని త్వరలో ఆర్టీసీలో ప్రవేశపెట్టనున్న ఎలక్ట్రిక్ ఏసీ బస్సులలోనూ అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
స్త్రీ శక్తి పథకం ద్వారా పల్లెవెలుగు, అల్ట్రా పల్లెవెలుగు, సిటీ ఆర్డినరీ, ఎక్స్‌ప్రెస్, మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణిస్తున్నారు. ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్, ఓటర్ కార్డ్‌లను ధ్రువీకరణ పత్రాలుగా చూపించాల్సి ఉంటుంది. ఏపీలోని దాదాపు 74 శాతం బస్సులు.. 6700 బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణిస్తున్నారు. స్త్రీ శక్తి పథకం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏడాదికి 2000 కోట్లు వెచ్చించనుంది.

Comments
Post a Comment